హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతి అదృశ్యం కేసు నమోదు

BDK: అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంకు చెందిన ఓ 22 ఏళ్ల యువతి అదృశ్యమైంది. సెప్టెంబర్ 28న సాయంత్రం వారపు సంతకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. యువతి ఆచూకీ లభిస్తే సమాచారం అందించాలని కోరారు.