హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కలెక్టర్

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి మర్యాదలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సునీల్‌కుమార్, ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, ఇన్‌స్పెక్టర్ అశోక్, పాల్గొన్నారు.