WGL: గాంధీజీపై అభిమానంతో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన నాగోతు బాలజోజి తన ఇంటి ప్రహరీపై రూ.30 వేలతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 65 ఏళ్ల క్రితం తన తండ్రి ఇంట్లో గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, పాత ఇల్లు శిథిలం కావడంతో కొత్త ఇంటి వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఆగస్టు 15, అక్టోబర్ 2న వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'గాంధీజీపై అభిమానంతో విగ్రహం'


