RR: ఈనెల 12 వరకు నూతన బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో చేవెళ్లకు ఒకటి, మొయినాబాదు రెండు బార్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష డీడీ చెల్లించాలన్నారు. ఈనెల 16న రంగారెడ్డి కలెక్టరేట్‌లో లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణ
ఫ్యూచర్ సిటీలో 3 కొత్త బార్లు.. దరఖాస్తులకు ఆహ్వానం


