హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వేగవంతం చేయాలి'

ADB: పాఠశాల విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్‌లను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం ప్రతి మండలంలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసి నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు.