హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

SRCL: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆధునిక PVC/ఫోమ్ మ్యాట్‌పై పోటీలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు తెలిపారు. మ్యాట్‌పై ఆటతో క్రీడాకారులకు భద్రతతో పాటు ఆధునిక క్రీడా వాతావరణం లభిస్తుందన్నారు.