SRD: న్యాల్‌కల్ తహసీల్దార్ ప్రభులు పదవీ విరమణ పొందిన సందర్భంగా గురువారం రాత్రి ముంగి చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
న్యాల్‌కల్ తహసీల్దార్ ప్రభులుకు ఘనంగా వీడ్కోలు


