హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్'

ADB: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసినట్లు CI నాగరాజు గురువారం తెలిపారు. బస్టాండ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు నిందితులు తానియా, తాన్యా, నిషా, ఆశు, సిమ్రాన్‌‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.