హైదరాబాద్: 28°C
తెలంగాణ

'15 రోజుల్లో మండలాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌'

KNR: జిల్లాలోని అన్ని మండలాలకు 15 రోజుల్లో సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలు, పీహెచ్‌సీలను తరచూ తనిఖీ చేయాలన్నారు. పెండింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.