హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏనుగు దంతాల స్మగ్లింగ్ భగ్నం.. ముగ్గురు అరెస్ట్!

హైదరాబాద్‌లో అక్రమంగా ఏనుగు దంతాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను DRI అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, చెక్కిన దంతపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏనుగు దంతాల వ్యాపారం నిషేధమని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.