KNR: గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావిత గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. గురువారం అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ముంపు ప్రభావం, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలపై వివరాలు సేకరించారు. పది శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందిస్తామన్నారు.
తెలంగాణ
నారాయణపూర్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన


