హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంజూరైన పనుల్లో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్‌

KMM: జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో మంజూరైన టాయిలెట్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని గురువారం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై రాజీ పడేది లేదన్నారు. ఆమోదం పొందిన పనుల్లో జాప్యం లేకుండా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.