హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

​SRD: కంగ్టి మండలం చౌకాన్ పల్లి గ్రామానికి చెందిన బసప్ప (50) అర్థరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారమందించారు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి అంబులెన్స్‌లోనే ప్రథమ చికిత్స అందిస్తూ, మెరుగైన వైద్యం కోసం ఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.