హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

WGL: గవిచర్లలో పేకాట ఆడుతున్న స్థావరంపై సంగెం పోలీసులు దాడి చేశారు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుండ బ్రహ్మయ్య ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాటపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.