హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంట పొలాల్లో క్షుద్ర పూజల కలకలం

MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలోని మల్లన్న బోడు కింద పంట పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొలం గట్లపై మట్టి బొమ్మను ఏర్పాటు చేసి కుంకుమ, పసుపు వేసిన ఆనవాళ్లను రైతులు గుర్తించారు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.