హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

AP: కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామేశ్వరంలోని పురపాలక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో బాలుడు పాల్గొనాల్సి ఉంది. అయితే, కాలికి గాయం కావడంతో పాల్గొనలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.