హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

AP: కర్నూలు జిల్లా ఆలూరులోని వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా పొగ కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బంది ఎదురైంది. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.3 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.