హైదరాబాద్: 28°C
క్రైమ్

విద్యుత్ షాక్‌తో మేనమామ, మేనల్లుడి మృతి

AP: బాపట్ల జిల్లా తోటవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కత్తి ఇస్సాక్(29), తిరువళ్ల శ్యామ్(24) ఫ్లోరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో ఫ్లోర్ మార్బుల్ పాలిష్ చేయడానికి మరికొందరితో కలిసి వెళ్లారు. మధ్యాహ్నం వరకు పని చేశారు. భోజనం అనంతరం పని ప్రారంభించగా పాలిషింగ్ మిషన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇస్సాక్, శ్యామ్ ప్రాణాలు కోల్పోయారు.