TG: రంగారెడ్డి జిల్లా నందిగామలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగమ్మ హత్య కేసులో నిందితులు ఇస్లావత్ చంద్రబాబు (28), పట్లావత్ మహేందర్ (21)ని అరెస్టు చేశారు. వారి నుంచి 28 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. బంగారం కోసం మంగమ్మను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
క్రైమ్
మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు


