జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా బసోహ్లీలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. CISF క్యాంప్‌లో ఓ జవాన్ తన తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోరం.. నలుగురు జవాన్లు మృతి


