హైదరాబాద్: 28°C
క్రైమ్

యువకుడిపై పోక్సో కేసు నమోదు

TG: హైదరాబాద్‌లోని KPHB పరిధిలో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. యువతిని ప్రేమిస్తున్నానంటూ గర్భవతిని చేసినట్లు చందు అనే యువకుడిపై యువతి తల్లి ఫిర్యాదు చేశారు. గతంలో గర్భనిరోధక మాత్రలతో యువతికి అబార్షన్ చేయించినట్లు ఆరోపించారు. యువతికి కడుపు నొప్పి రావడంతో తల్లి నిలదీయగా ఈ ఘటన వెలుగు చూసింది. తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.