హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాముడు-శివుడిని విడదీయడం సనాతన ధర్మానికి విరుద్ధం అని తెలిపారు. రాముడు, శివుడిని ఉత్తర, దక్షిణాలుగా విభజించడం సరికాదన్నారు. హరి-హరులను ఏకం చేయడమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పారు.