హైదరాబాద్: 28°C
వార్తలు

'పదవులు తాత్కాలికం.. సేవలు శాశ్వతం'

KRNL: పదవులు తాత్కాలికమైనా ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. కృష్ణగిరిలో తాజా మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యుడికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మండల అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎంపీపీని ఆమె అభినందించారు.