హైదరాబాద్: 28°C
క్రైమ్

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని రామ్ మందిర్ ఈస్ట్ ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు మృతిచెందారు. రసాయన వాయువు లీక్ అవడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఏ రసాయనం లీక్ అయింది అనేది నిర్ధారణ కాలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు రసాయన వాయు నమూనాలను సేకరించే చర్యలు చేపట్టారు.