హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆస్తి కోసం పక్షవాతం ఉన్న తల్లిపై దాడి

TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపైనా కుమారుడు దాడి చేశాడు. నాలుగేళ్లుగా అన్న, వదిన, ఆమె సోదరుడు ఆస్తికోసం తనను, తన తల్లిని వేధింపులకు గురిచేస్తున్నారని బ్యాంకు ఉద్యోగి నాగార్జున ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు FIR నమోదు చేయలేదన్నాడు.