AP: విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ప్రేమపెళ్లి నేపథ్యంలో యువకుడిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేశారు. మజ్జిపేటకు చెందిన యువకుడు సహా ఆరుగురిపై దాడికి పాల్పడ్డారు. ఘర్షణను చిత్రీకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ పైనా కత్తితో దాడి చేశారు. బాధితులు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన భీమునిపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ప్రేమపెళ్లి.. ఆరుగురిపై కత్తులతో దాడి


