KRNL: కోసిగి మండలంలో నిర్వహించిన వన్ మంత్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో 109 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 62, పంచాయతీరాజ్‌కు 16, సర్వే శాఖకు 25 అర్జీలు అందాయి. హౌసింగ్‌కు 2, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
'కోసిగిలో 109 అర్జీల స్వీకరణ'


