హైదరాబాద్: 28°C
క్రైమ్

చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్

AP: చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హావ్‌డా-చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను తుని రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. లగేజ్ బ్యాగుల్లో చాక్లెట్ల రూపంలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద మూడు చొప్పున గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.