హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ హృదయ దినోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం

GDWL: వడ్డేపల్లిలోని 7వ వార్డులో ఈ నెల 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏఐ స్టెతస్కోప్ హార్ట్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వడ్డేపల్లి మున్సిపల్ మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ నేడు కలెక్టర్ రిజ్వాన్‌ను కలిసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.