హైదరాబాద్: 28°C
వార్తలు

29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం: ఎంపీ

TG: ఢిల్లీలో ఈనెల 29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీ మల్లు రవి వెల్లడించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత, ఆదివాసీల సమస్యలు, హక్కులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఇటీవల ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జరిగిన అవమానకర ఘటనపైనా చర్చించనున్నట్లు చెప్పారు.