హైదరాబాద్: 28°C
క్రైమ్

ఉరేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

AP: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చిన్న వాల్తేరులోని అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకుంది. మృతురాలిని హైదరాబాద్‌కు చెందిన శ్రావణిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.