హైదరాబాద్: 28°C
వార్తలు

భూసేకరణకు పరిహారం పూర్తిగా చెల్లింపు

గుంటూరు ఛానల్ విస్తరణకు భూములు ఇచ్చిన 7 గ్రామాలకు చెందిన 322 మంది రైతులకు రూ.70.17 కోట్ల పరిహారం పూర్తిగా చెల్లించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఐదు విడతల్లో రూ.70,17,46,929 విలువైన 19 సీఎఫ్‌ఎంఎస్ బిల్లులు క్లియర్ చేసినట్లు వెల్లడించారు. రైతుల సహకారంతో ఛానల్ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు.