TG: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్‌లో లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు జైపూర్ మండలానికి చెందిన కూలీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి


