హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గణేష్

RR: ఫరూఖ్‌నగర్ ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉప్పరిగడ్డకు చెందిన గణేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షాద్‌నగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన గిరిజన నాయకుల సమావేశంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులకు గణేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.