హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల మార్కెట్‌లో రైతుల అవస్థలు

VKB: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎండ, వానను లెక్కచేయకుండా రోడ్డుపైనే పంటను విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.