SRPT: కోదాడ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్, బ్లాక్ బెల్ట్ ఐదో డాన్ కొండపల్లి క్రాంతికుమార్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ముంబైలో నిన్న రాత్రి జరిగిన తొమ్మిదో ఆసియా కప్ అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో, అండర్-30 కటా విభాగంలో రజత పతకం సాధించారు. పతకం, ధ్రువపత్రం అందుకున్నారు. కాగా ఈరోజు కోదాడ పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఆయనను అభినందించారు.
తెలంగాణ
అంతర్జాతీయ స్థాయిలో కోదాడ పట్టణ వాసి ప్రతిభ


