హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైనా దాడితో ఆవు మృతి

VKB: బసిరెడ్డిపల్లి శ్రీకృష్ణగిరి క్షేత్ర సమీపంలోని గోశాలలో ఆవు మృతి ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రతిమ ఘటనా స్థలాన్ని పరిశీలించి పశువుల కాపరిని విచారించారు. వన్యప్రాణుల చిత్రాలను చూపించగా హైనా దాడి చేసినట్లు కాపరి గుర్తించారు. ఆవును చంపింది చిరుత కాదని, హైనానే అని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.