VKB: అధ్యాపకులు అందించిన విద్య, చూపిన మార్గదర్శకత్వమే తమను ఉన్నత స్థాయికి చేర్చిందని దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో ఆదివారం రసాయనశాస్త్ర పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో 84 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మాజీ అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
అధ్యాపకులతో పూర్వ విద్యార్థుల సందడి


