VZM: ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భోగాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
వార్తలు
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్


