హైదరాబాద్: 28°C
క్రైమ్

వివాహేతర సంబంధం.. బాలుడి హత్య

వివాహేతర సంబంధం బాలుడి హత్యకు దారి తీసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. భర్తతో విడిపోయిన పూవరసి అనే మహిళ, పెయింటర్ తమిళ్‌సెల్వన్‌తో సహజీవనం చేస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, మద్యం మత్తులో ఉన్న తమిళ్‌సెల్వన్ ఇంటికి వచ్చి పూవరసి కుమారుడు తరుణ్ (4వ తరగతి)ను హత్య చేశాడు. అనంతరం ఆమెకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.