హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌ను ఢీకొన్న కారు

వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు శివారులో గురువారం కారు తాత్కాలిక డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో  ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతడిని 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డివైడర్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దాన్ని తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.