హైదరాబాద్: 28°C
వార్తలు

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు పునఃప్రారంభం

WGL: నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ..అక్టోబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని  వెల్లడించారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ పర్సంటైల్ తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.