KDP: కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు SI హనుమంతు తెలిపారు. బేతంచర్ల రైల్వేస్టేషన్‌లో రైలులో పారిపోతున్న పోకల వెంకట సుబ్బయ్య, సుభాశ్ చంద్ర భాను, ప్రసాద్లను పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను మైదుకూరు ఎన్డీపీఓ ఎదుట హాజరుపరిచి, కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
వార్తలు
పరారీలో ఉన్న ముగ్గురు అరెస్ట్: సీఐ


