హైదరాబాద్: 28°C
వ్యాపారం

తుది దశకు జియో ఐపీఓ

మెగా ఐపీఎకు జియో సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సుమారు రూ.37 వేల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా పబ్లిక్‌ ఇష్యూకు సంబంధిత డాక్యుమెంట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఐపీఓలో 27 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఇవి కంపెనీలో 2.9శాతం వాటాకు సమానం. ఐపీఓ కోసం కంపెనీ విలువను 137 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.13,00,000 కోట్లు)గా అంచనా వేసినట్లు సమాచారం.