SRPT : పాలకవీడు తహశీల్దార్ కార్యాలయం పాత మెడికల్ సబ్‌సెంటర్ భవనంలోకి మారింది. హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ దీనిని ప్రారంభించారు. కిరాయి బకాయిలతో పాత అద్దె భవనానికి యజమాని తాళం వేయడం, సబ్‌సెంటర్‌కు కొత్త భవనం రావడంతో ఖాళీ అయిన ప్రభుత్వ భవనంలోకి కలెక్టర్ ఆదేశాలతో మార్చారు. ప్రధాన రహదారిపై ఉన్న ఈ విశాలమైన భవనం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
కొత్త భవనంలోకి పాలకవీడు తహశీల్దార్ కార్యాలయం


