హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా..!

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన సంగెం ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, పట్టుదలతో ఆయన సాధించిన ఈ అరుదైన విజయం స్థానిక యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.