హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగులో టేకు దుంగలు గుర్తింపు

NZB: సిరికొండ రావుట్ల అటవీ సెక్షన్ పరిధిలోని కంపార్ట్‌మెంట్‌ నం.394లో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందికి వాగులో కుప్పగా ఉంచిన 37 టేకు దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సిరికొండ రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. వాటి విలువ సుమారు రూ.68 వేలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. అడవి నరికితే కఠిన చర్యలు తప్పవని నర్సింగ్ రావు హెచ్చరించారు.