KRNL: తుగ్గలి మండలంలో పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. రూ.40,500 విలువైన యంత్రానికి ప్రభుత్వం రూ.20,250 రాయితీ ఇవ్వగా, రైతు వాటాగా రూ.20,250 చెల్లించాలి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనందున ఆసక్తి ఉన్న పాడి రైతులు సంబంధిత పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
వార్తలు
పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలు


