హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాద బాధితురాలిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుగ్గలి మండలం కోతికొండకు చెందిన సువర్ణమ్మను గురువారం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని శ్రీదేవమ్మ ఆకాంక్షించారు.