హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ జిల్లా కమిటీ ఎన్నికలు

MDK: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు RDO తెలిపారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 688 మంది ఓటర్లు 15 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.